ఇండస్ట్రీలో టాలెంట్ తో పనిలేదు.. వాళ్లకు అవే కావాలి – నిధి అగర్వాల్

-

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కి మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే అభిమానులు ఉన్నారు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే అఖిల్ స‌ర‌స‌న మ‌జ్నులో న‌టించి మాయ చేసింది. ఆ వెంట‌నే ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది.

అయితే.. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా? లేరా? అనేది చూస్తారు. రాబోయే సినిమాల్లో హీరోయిన్ల పని గ్లామర్ షో చేయడమే. నేను గ్లామర్ షో చేయడానికి వెనుకాడను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ సరసన హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news