రెట్రో లుక్ లో అదరగొట్టిన నిహారిక

-

మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాలలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలోనూ కనిపించింది.

తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల నిహారిక, ఆమె భర్త చైతన్య, ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడం, నిహారికతో ఉన్న ఫోటోలని చైతన్య డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో సైతం ఎక్కడ ఆక్టివ్ గా లేని నిహారిక.. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. రెట్రోలుక్ లో పాతకాలంనాటి హీరోయిన్ లా మెరిసిపోతున్న ఫోటోలను పోస్ట్ చేసింది. నిహారిక పోస్ట్ చేసిన ఈ ఫోటోలు రెట్రో గెటప్ లో అలనాటి అందాల తారలను గుర్తు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news