‘ఆర్​డీఎక్స్’​ హీరోకు జోడీగా మెగా డాటర్​ నిహారిక

-

మెగా డాటర్ నిహారిక కొణిదెల సినిమాల్లో జోరు పెంచింది. ఓవైపు ప్రొడ్యూసర్ గా మరోవైపు నటిగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇంకోవైపు వెబ్ సిరీస్ లతో డిజిటల్ తెరపైనా తన సత్తా చాటుతోంది. ఇటీవల డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్​తో ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాలో నిహారిక కీ రోల్​ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టుపై సైన్​ చేసింది మెగా డాటర్​. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా ఆ మూవీ టీమ్​ షేర్ చేసింది. అయితే ఈ ఇది మలయాళ చిత్రం. ‘ఆర్​డీఎక్స్​’ ఫేమ్​ మాలీవుడ్​ నటుడు షేన్‌ నిగమ్‌కు జంటగా నిహారిక ఈ చిత్రంలో కనిపించనుంది. ‘మద్రాస్‌కారన్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version