నితిన్​ హీరోయిన్​ బాంబ్​ బ్లాస్టింగ్​ పోజులు.. 42ఏళ్ల వయసులో చెమటలు పట్టించేలా..

హీరో నితిన్ ‘ధైర్యం’ చిత్రంలో హీరోయిన్​గా నటించిన ముద్దుగుమ్మ రైమా సేన్​. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్​లోకి అలా వచ్చి ఇలా కనుమరుగైపోయింది. 2005లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్​గా నిలిచింది.

అయితే టాలీవుడ్​లో రాణించనప్పటికీ ఈ అమ్మడు.. హిందీ, బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్​లలోనూ నటిస్తోంది. అలానే 42 ఏళ్ళ వయసులోనూ కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకు అందాన్ని మెయిన్​టెయిన్ చేస్తోంది.


తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్​స్టా గ్రామ్​లో అదిరిపోయే పోజులతో ఫొటోలను, వీడియోను పోస్ట్​ చేసింది. వీటిని చూస్తే.. ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. కళ్ళు చెదిరే హాట్ నెస్​తో వేడి సెగలు పుట్టిస్తోంది. ఇందులో ఆమె మోనోకిని డ్రెస్​పై గ్రీన్ జాకెట్ ధరించింది స్టైలిష్​గా అంతకు మించి హాట్​గా కనిపించింది.

ఈ ఫోటోషూట్​లో రైమాసేన్ క్లీవేజ్ అందాలతో ఫుల్​ ఎక్స్​పోజింగ్​ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అయిన ఈ బాంబ్ బ్లాస్టింగ్ పోజులు కుర్రాళ్లను కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఆమె పోస్ట్ చేసిన బికినీ అందాలు కూడా నెటిజన్ల మతి పోగొట్టే విధంగా ఆకట్టుకున్నాయి.

కాగా, ఈ అందాల హాట్ బ్యూటీ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తోంది. మోడల్​గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 2000 లోనే హీరోయిన్​గా ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్​లతోనూ అలరిస్తోంది. రీసెంట్​గా ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్​లో నటించింది.