మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశేనా..SSMB28 అప్‌డేట్ వచ్చేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ కూడా ఆయన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఆశగా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కాగా, ఈ సారి వారికి నిరాశ మిగిలిందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మహేశ్ ప్రజెంట్ ఆయన స్నేహితుడు తివ్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘అతడు, ఖలేజా’ను మించి ఉంటుందని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

మంగళవారం కృష్ణ బర్త్ డే సందర్భంగా టీమ్ SSMB28 పేరిట ప్రొడక్షన్ హౌజ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు తమ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో కృష్ణకు హ్యాపీ బర్త్ డే తెలిపే పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కేవలం SSMB28 అనే పేరుంది తప్ప సినిమా టైటిల్ లేదు. దాంతో అభిమానులకు నిరాశే మిగిలింది.

బహుశా ఈ రోజు సాయంత్రం వరకు అయినా మరో పోస్టర్ రిలీజ్ చేస్తారా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. SSMB28 ఫిల్మ్ కు ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక. SSMB29..దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ ఫిల్మ్ అప్ డేట్ కూడా ఏమీ రాలేదు. చూడాలి మరి..ఈ సినిమాల అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో..