ఎన్టీఆర్-బాలయ్య నటించిన ఈ చిత్రం విడుదల కాలేదు.. ఎందుకో తెలుసా?

-

తెలుగు ప్రజల ఆరాధ్యుడు ..విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, కళా ప్రపూర్ణ, డాక్టర్ నందమూరి తారక రామారావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.

సినీ పరిశ్రమలో తగిన గుర్తింపు పొందిన ఎన్టీఆర్.. తనను అంతటి వాడిని చేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఆయన రాజకీయ, నట వారసుడిగా సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలయ్య కొనసాగుతున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా, ప్రముఖ సినీ నటుడిగా బాలయ్య ప్రజల మధ్య ఉంటున్నారు.

 

ఎన్టీఆర్-బాలయ్య కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు చూసి జనాలు, నందమూరి అభిమానులు ఫిదా అయిపోయారు. కాగా, వీరిరువురు కలిసి నటించిన ఓ పిక్చర్ రిలీజ్ కు నోచుకోలేదు. అసలెందుకు ఆ సినిమా విడుదల కాలేదో కారణాలు తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన చూపిన త్రోవలో బాలయ్య పలు జానపద, సాంఘీక సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వేశ్వరరావు నిర్మాణంలో బాలయ్య, ఎన్టీఆర్, జమున కాంబోలో ఓ భారీ ఫిల్మ్ ప్లాన్ చేశారు. జానపద చిత్రంగా ఈ సినిమా రికార్డులు తిరగరాసేలా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు ‘కంచు కాగడ’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. అనంతరం సీనియర్ ఎన్టీఆర్, కాంతారావులపై కొన్ని సీన్లు చిత్రీ‌కరించారు. తండ్రీ తనయులు ఎన్టీఆర్-బాలయ్య మధ్య ఈ చిత్రంలో చక్కటి సీన్లు ఉండాలని అప్పట్లో నిర్మాత చర్చించారట.

ఆ తర్వాత షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో హీరోయిన్ జమున గర్భవతి అయింది. అలా ఆ సినిమా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడింది. జమున ప్రసవం తర్వాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్, కాంతారావు, బాలయ్య ఇతర ఆర్టిస్టులు కూడా ఓకే అన్నారు. అంతలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాల్సిన బాలీవుడ్ నటుడు ఒకరు చనిపోయారు. అలా చిత్ర షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. అలా ‘కంచు కాగడ’ సినిమా ఇంత వరకూ పూర్తి కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news