బిగ్ బాస్-3కు ఎన్టీఆర్.. కండీషన్స్ అప్లై..!

-

రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ తెలుగులో 3వ సీజన్ కు రెడీ అవుతుంది. ఈ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్నాడని దాదాపుగా కన్ఫాం అయ్యింది. అందుకోసం తారక్ 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇదిలాఉంటే రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు బిగ్ బాస్ కంటెస్టంట్స్ విషయంలో కూడా ఎన్.టి.ఆర్ తన జోక్యం ఉండేలా చూసుకుంటున్నాడు.

ఎవర్ని పడితే వాళ్లను తెచ్చి హౌజ్ లో వేయకుండా అన్ని రంగాల వారిని తెచ్చి షో మరింత అందంగా చేయాలని తారక్ సలహా ఇచ్చాడట. అంతేకాదు బయట స్నేహితులుగా ఉన్న వారిని కంటెస్టంట్స్ గా తీసుకుంటే వారు హౌజ్ లో గ్రూపులు కట్టేస్తారని అలాంటి వాళ్లు అసలు వద్దని చెబుతున్నాడట ఎన్.టి.ఆర్.

ఎన్.టి.ఆర్ ఫైనల్ చేస్తేనే కంటెస్టంట్స్ లిస్ట్ ఫైనల్ అవుతుందట. ఇక ఈసారి కూడా 100 రోజులు కంటెస్టంట్స్ ఇంట్లో ఉంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఎన్.టి.ఆర్ పెట్టిన కడీషన్స్ కు ఓకే అంటేనే తను హోస్ట్ గా చేస్తాడట. లేదంటే వేరే వాళ్లను చూసుకోమన్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news