వీరమల్లు టీజర్ కోసం కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.!

-

పవన్ కళ్యాణ్  సినిమా హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఫ్యాన్స్ అంటుంటే  ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది అని ఎప్పటికప్పడు యూనిట్ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఈ సినిమా చేసిన టైమ్ లో ఇప్పటికి మూడు సినిమాలు అయ్యే అవకాశం ఉందని, కనీసం టీజర్ కూడా లేకుండా ఎన్ని రోజులు అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మరో పక్క హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కూడా ఉంది. కాని పవన్ నుంచి వెంటనే సినిమా రావడం లేదు. పవన్ ఫ్యాన్స్ మాత్రం పాత సినిమాలు మళ్లీ రిలీజ్ అయినా వాటినే హిట్ చేస్తూ ఆనంద పడుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం కు పూజలు చేపిస్తూ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా మారి పోతున్నారు. ఇక ఈ సినిమాను నిజంగా ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హరి హర వీరమల్లు టీజర్ కోసం వెయిట్ చేసిన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉన్న హరి హర వీరమల్లు సినిమా అప్డేట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news