న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద మెరిసిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు బయట విదేశాలలో ఉన్న ఆయన అభిమానులు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఇప్పుడు విదేశాలలో ఉన్న ఆయన అభిమానులు కూడా ఇలా వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తాజాగా అమెరికాలో పవన్ అభిమానులు ఏకంగా పవన్ కళ్యాణ్ బర్తడే వేడుకలను నిర్వహించారు. అంతేకాదు న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోని కూడా ప్లే చేయడం జరిగింది. సాధారణంగా ఈ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద వీడియో ప్లే అవ్వాలని ఎంతోమంది నటీనటులు మోడల్ కూడా కోరుకుంటూ వుంటారు. ఇకపోతే మన ఇండియన్స్ ఈ మధ్యకాలంలో తమ అభిమాన హీరోల స్పెషల్ డేస్ లో అలాగే మన పండుగలకు సంబంధించిన వీడియోలను అక్కడ ప్లే చేసి తమ అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు.

ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ వీడియోని ప్లే చేయడంతో ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారింది. దీన్ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. తన నటనతో మేనరిజంతో ఒక తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఒక వైపు సినిమాలు చేస్తూ.. మరొకవైపు రాజకీయాలలో కూడా వినూత్నంగా దూసుకుపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version