ట్రెండ్ ఇన్: ఫంక్షన్ ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ పవన్ కల్యాణే..శివ కార్తీకేయన్‌తో ముచ్చట్లు

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుసగా సినిమా ఫంక్షన్స్ కు అటెండ్ అవుతున్నారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన్ పవర్ స్టార్..తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలోనే జాన్వి నరాంగ్-ఆదిత్యల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు అందరూ హాజరు కాగా, ప్రత్యేక ఆకర్షణగా పవన్ కల్యాణ్ నిలిచారు. ఈ ఫంక్షన్ కు వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ తో పవన్ కల్యాణ్ ముచ్చటించారు.

పవన్ కల్యాణ్ ను ఇలా వరుసగా పబ్లిక్ ఫంక్షన్స్ లో చూసిన ఆయన అభిమానులు ..ఆయన ఫొటోలను వరుసగా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. #PawanKalyan పవన్ కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ తో అలా వరుసగా ట్వీట్స్ చేస్తుండటంతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. శివ కార్తీకేయన్ తో సరదాగా పవన్ కల్యాణ్ ముచ్చటిస్తున్న వీడియోను అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

శివ కార్తీకేయన్ ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే ఫిల్మ్ చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’తో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news