రాధే శ్యామ్ గురించి అలా చెబుతున్నారు ఏంటి

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , గ్లామర్ డాల్ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జిల్ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా  పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయనతో తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని ఆయన ఆస్థాన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తలిచింది.
అందుకు తగ్గట్లే బాహుబలి తర్వాత వచ్చిన సాహా సైతం పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కేవలం హిందీ భాషలో ఈ చిత్రం విజయం సాధించి మిగిలిన భాషల్లో పరాజయం పోంది ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ తన పాన్ ఇండియా మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు ప్రభాస్ ఇప్పటికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా ఆయన నటించిన రాధే శ్యామ్ గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా చూసిన పలువురు ప్రేక్షకుల్లో కొంతమంది బాగాలేదని, మరికొందరు సూపర్ హిట్ చిత్రం అని చెబుతున్నారు. ఏది ఏమైనా రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news