బాలీవుడ్ సూపర్ స్టార్ ఫిల్మ్ అప్‌డేట్ ఇచ్చేసిన బుట్ట బొమ్మ

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ భామ..టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్ అప్ డేట్ ఇచ్చేసింది.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సల్లూ భాయ్ ‘కబీ ఈద్ కబీ దివాళి’ చిత్ర షూటింగ్ జరుగుతోంది. కాగా, తాజాగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలిపింది పూజ. సెకండ్ షెడ్యూల్ పూర్తయిందని తెలుపుతూ ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టింది. దాంతో సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ సినిమా స్టోరి గురించి కూడా లీక్ ఇచ్చేసింది. రొమాంటిక్ లవ్ స్టోరి చాలా బాగుటుందని చెప్పింది. పూజా హెగ్డే మరో వైపు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో ‘సర్కస్’ ఫిల్మ్ చేస్తోంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘జన గణ మన’.., మహేశ్-త్రివిక్రమ్ SSMB28లోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ పొడుగు కాళ్ల సుందరి.