పూజా హెగ్డేకు చేదు అనుభవం..ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుపై హీరోయిన్ ఫైర్

-

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ విమాన ప్రయాణాలు మాత్రమే చేస్తోందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి ఇబ్బంది ఎదురైంది. ఈ విషయమై ఆమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో విపుల్ నకాషే అనే IndiGo6E స్టాఫ్ ఒక‌రు తమతో చాలా అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎంతో బాధ‌గా ఉందని, ఎలాంటి కారణం లేకుండానే తమతో అహంకారపూరితంగా, అజ్ఞానంగా ప్రవర్తించాడని, బెదిరింపులకు దిగాడని పూజ తెలిపింది.

ఈ ఘటన చాలా భయంకరంగా జరిగిందని పేర్కొంది పూజా హెగ్డే. ఈ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ ఏదైనా విచారణ చేపడుతుందో చూడాలి. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్, కభీ దివాళి’ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కోసం హైదరాబాద్ కు పూజా వచ్చినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘జన గణ మన’ సినిమాలోనూ పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news