ప్రభాస్ సరికొత్త రికార్డు..ఆనందంలో అభిమానులు

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్..‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ కు..ఫ్యాన్స్ ఆ సినిమాతో ఏర్పడ్డారు. ఇక బాలీవుడ్ లో అయితే ప్రభాస్ క్రేజ్ అమాంతంగా పెరిగింది. కాగా, ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించారు.

బాక్సాఫీసు వద్ద ‘రాధే శ్యామ్’ బోల్తా కొట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ లవ్ స్టోరి ..ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమా సందర్భంగా తీసుకున్న రెమ్యునరేషన్ విషయమై ప్రజెంట్ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ చిత్రానికి ప్రభాస్..రూ.75 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ఫిల్మ్ ‘సలార్’ కోసం ప్రభాస్ ఏకంగా రూ.100 కోట్లు పారితోషికం తీసుకుని పాన్ ఇండియా రేంజ్ చాటుకున్నాడని వార్తలొస్తున్నాయి. అలా తన రెమ్యునరేషన్ పెంచుకున్న వన్ అండ్ ఓన్లీ సౌతిండియన్ స్టార్ ప్రభాస్ అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ మేరకు ప్రభాస్ సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న, చేయబోయే సినిమాలకు రూ.120 కోట్ల కు రెమ్యునరేషన్ పెంచుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు.