కన్నప్ప నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్

-

యంగ్ రెబల్ స్టార్ కి కన్నప్ప చిత్ర బృందం స్పెషల్ విషెస్ తెలిపింది. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ తో పాటు ప్రభాస్ కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ లో ప్రభాస్ గురించి రాస్తూ.. ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో నటనతో గెలుచుకొని ప్రపంచం అంతా శభాస్ అనిపించుకుంటున్న మా ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి శత శత మానం భవతి అంటూ కన్నప్ప టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించనున్నారు. బుల్లితెరపై మహారభారతం సీరియల్ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివ భక్తుడు అయిన కన్నప్ప జీవితం ఆధారంగా తీసుకొని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version