ఫ్యామిలీ ఫోటోలతో రచ్చ చేస్తున్న ప్రగతి ఆంటీ.. పిక్స్ వైరల్.!

-

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో ఎంత పద్ధతిగా ఉంటుందో.. బయట అంతే హాట్ వయ్యారాలను ఒలకబోస్తూ ఇంస్టాగ్రామ్ లో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఈమె లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక జిమ్ లో రకరకాల స్టంట్ లు వేస్తూ .. రోడ్డుపై పలు మాస్ పాట లకు స్టెప్పులు వేస్తూ.. అప్పుడప్పుడు వయ్యారాలు వలకబోస్తూ ఈ ముద్దుగుమ్మ చేసే పనులు అంతా ఇంతా కాదని చెప్పాలి. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన వీడియోలను, పాటలను , డాన్స్ కు సంబంధించిన వీడియోలను ఇలా అన్నింటినీ కూడా షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతూ వస్తోంది.

ఇక ఇప్పటివరకు ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వచ్చాయి. కానీ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కానీ, తమ పిల్లల ఫోటోలు కానీ ఎప్పుడూ ఎవరు చూడలేదని చెప్పాలి. కానీ తాజాగా ప్రగతి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా జరిపిన వేడుకలను పురస్కరించుకొని.. ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రగతి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకుంటూ మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది.

ఇక అటు సినిమాల ద్వారా బాగా పాపులారిటీని పొందుతూనే ఇటు సోషల్ మీడియా ద్వారా మరింత మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమెకు పారితోషికం విషయంలో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇక తక్కువ బడ్జెట్ సినిమాలకు రూ.75, 000 వరకు తీసుకునే ప్రగతి.. బడ్జెట్ ఎక్కువగా ఉండి తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉంది అంటే 2 లక్షల రూపాయలు వరకు తీసుకోవడానికి వెనుకాడడం లేదు.ఇకపోతే ప్రగతి ఆంటీ షేర్ చేసిన తన ఫ్యామిలీ పిక్స్ మీరు కూడా ఒకసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news