ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమ్‌ కుమార్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

టాలీవుడ్ యంగ్ హీరో సంతోశ్ శోభన్.. జయాపజయాలతో సంబంధం లేకుండా  సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో తాజాగా చేసిన సినిమా ప్రేమ్ కుమార్. సంతోష్‌ శోభన్‌, రాశీ సింగ్‌, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, రుచిత సాధినేని ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషేక్‌ మహర్షి తెరకెక్కించిన ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమా.. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా’ వేదికగా ఈ మూవీ సందడి చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా స్టోరీ ఏంటంటే..  ప్రేమ్‌ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభ‌న్‌) వెడ్డింగ్ డిటెక్టివ్‌. త‌న స్నేహితుడు సుంద‌ర్ లింగం (కృష్ణ తేజ‌)తో క‌లిసి పెళ్లిళ్లు చెడ‌గొడుతూ, ప్రేమికుల్ని విడ‌గొడుతూ డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. ప్రేమ్‌ కుమార్‌కి కూడా అలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. మ‌రికొన్ని క్ష‌ణాల్లో నేత్ర (రాశీసింగ్‌) మెడ‌లో మూడుముళ్లు వేస్తాడ‌న‌గా… అంత‌లోనే రైజింగ్ స్టార్ రోష‌న్ (కృష్ణ‌ చైత‌న్య) మండ‌పంలోకి వ‌చ్చి తాను నేత్ర‌ని ప్రేమిస్తున్నాన‌ని సినిమా ఫ‌క్కీలో మాట‌లు చెప్పి ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. త‌న‌తోపాటు నేత్ర‌ని తీసుకొని వెళ్లిపోతాడు. అలా నేత్ర‌తోనే కాకుండా మ‌రో ఇద్ద‌రితోనూ ప్రేమ్‌కుమార్ పెళ్లి మండపం దాకా వ‌చ్చి పెటాకులవుతుంది. ఆ త‌ర్వాత ఎంత ప్ర‌య‌త్నించినా పెళ్లి కాదు. అలా త‌న పెళ్లి క‌ష్టాలేవో త‌ను ప‌డుతూ, త‌న వ్యాపారం తాను చేసుకుంటుండ‌గా అత‌ని దారికి నేత్ర మ‌రోసారి అడ్డొస్తుంది. మ‌రోవైపు రోష‌న్… నేత్ర‌ని కాకుండా అంగ‌న (రుచిత సాధినేని)ని పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. అందుకు కార‌ణ‌మేమిటి? అప్పుడు నేత్ర ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? ఇంతకీ ప్రేమ్‌ కుమార్‌కి పెళ్లి అయ్యిందా లేదా? అన్నది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version