PSPK26 లో పవన్ రోల్ ప్రత్యేకతలు…!! సాంబా రాస్కోరా.. బొమ్మ హిట్టు

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాలు తీసి మంచి సక్సెస్ లు అందుకున్న వేణు, ఈ సినిమాని ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇటీవల బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కి మంచి విజయం సొంతం చేసుకున్న పింక్ కు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఆయన పాత్ర తెరపై ఎంతో అదిరిపోనుందని టాక్.

ఇతర పాత్ర ధారులైన అంజలి, నివేత థామస్, అనన్యలు కలిసి ఒక కేసు లో ఇరుక్కోవడంతో దానిని టేకప్ చేసే లాయర్ గా పవన్ ఈ సినిమాలో కనపడనున్నారట. ఇక ఆయనకు ప్రతివాది లాయర్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల నుండి మంచి ఫేమస్ లాయర్ అయిన ఒక వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వలన తన వృత్తికి కొన్నాళ్ళపాటు దూరం అవుతారని, అయితే ఒకానొక సమయంలో అమాయకంగా ముగ్గురు అమ్మాయిలపై మోపబడిన కేసుని ఛేదించే పనిలో భాగంగా మళ్ళి తన వృత్తిలోకి ప్రవేశించి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా ఎలా వ్యవహరించారు అనే పంథాలో పవన్ పాత్ర సాగనుందని అంటున్నారు.

ఇక ఇదే సినిమాని ఇటీవల తమిళ్ లో అజిత్ హీరోగా “నెర్కొండ పార్వై” పేరుతో రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. అయితే తమిళ సినిమాలో అజిత్ పాత్రకు ఒక ఫైట్ జోడించి సినిమాని మరింత ఆసక్తికరంగా ముందుకు నడిపారు. ఇక ప్రస్తుతం తెలుగులో కూడా పవన్ క్యారెక్టర్ కు ఒక పవర్ఫుల్ ఫైట్ పెట్టడం జరిగిందని, అలానే సందర్భానుసారం మొత్తం సినిమాలో మూడు పాటలు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నారని తెలుస్తోంది……!!

Read more RELATED
Recommended to you

Latest news