ట్రెండ్ ఇన్: ‘పుష్ప’ మేనియా కంటిన్యూస్..సినిమా విడుదలై ఇన్ని రోజులైనా తగ్గేదేలే..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ అవడంతో పాటు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘పుష్ప’ రాజ్ గా బన్నీ అదరగొట్టేశాడు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ పిక్చర్ దేశవ్యాప్తంగా బాగా ఆడింది.

సౌత్ తో పాటు నార్త్…ఆడియన్స్ కూడా ఈ ఫిల్మ్ ను బాగా యాక్సెప్ట్ చేశారు. రష్మిక మందన ‘శ్రీవల్లి’గా ఈ చిత్రం లో చక్కటి అభినయం కనబర్చింది. కాగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి హీరోయిన్ గా తన ఫస్ట్ ఫిల్మ్ లో నటించిన హన్సిక మోట్వానీ..‘పుష్ప’ మేనరిజమ్ రీ క్రియేట్ చేసింది.

తగ్గేదేలే అంటూ ‘పుష్ప’ రాజ్ మాదిరిగా ఫోజు ఇచ్చింది. అలా ఆ ఫోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, నెటిజన్లు, సినీ అభిమానులు ‘పుష్ప’ చిత్రానికి సంబంధించిన వీడియోలు హ్యాష్ ట్యాగ్ పుష్ప పేరిట #Pushpa మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అలా నెటిజన్ల వరుస ట్వీట్లతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. హన్సిక..తన తొలి చిత్రం ‘దేశముదురు’లో బన్నీకి జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప-2’ పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారని వినికిడి. పార్ట్ వన్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 స్టోరిపైన సుకుమార్ మరింత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఊహించని ట్విస్టులు సెకండ్ పార్ట్ లో ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.