దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం కనబడుతోంది. గల్లీ నుంచి మొదలుకుని సిటీ , దేశ రాజధాని వరకు అన్ని చోట్ల వినాయక మండపాలు సిద్ధమయ్యాయి. వినాయక విగ్రహాలను ప్రతిష్టించి యువత గణపతి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, కొన్ని మండపాలలో సినీ వినాయకులు వచ్చేయడం విశేషం.
కొన్ని చోట్ల RRR సినిమాలో రామ్ చరణ్, తారక్ గెటప్ లలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ‘పుష్ప’ రాజ్ గెటప్ వినాయకులను ప్రతిష్టించారు. అది చూసి జనాలు వావ్ అంటున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్లు ‘‘పుష్ప’ రాజ్ ..తగ్గేదేలే’ అని కామెంట్స్ చేస్తున్నారు. గణేశుడు.. ‘పుష్ప’ రాజ్ అయిపోయాడని మరి కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ‘పుష్ప-2’ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి అందరికీ విదితమే. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఇలా సినీ వినాయకులను ఏర్పాటు చేశారు. అలా సందడి వాతావరణం అయితే ఏర్పడింది.