Ranveer Singh: తండ్రి కాబోతున్న రణ్‌వీర్ సింగ్..కూతురా? కొడుకా?

-

బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ అప్పుడే గుడ్ న్యూస్ చెప్పేశాడు. అవునండీ..మీరు చదివింది నిజమే..తనకు పుట్టబోయేది కూతురా? కుమారుడా? అని అభిమానులనే ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రణ్ వీర్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేశాడు. అది చూసి నెటిజన్లు నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకునే దంపతులు అప్పుడే గుడ్ న్యూస్ చెప్పేశారా? అని అనుకుంటున్నారు.

సదరు పోస్టులో రణ్ వీర్ సింగ్ తనకు పుట్టబోయేది బిడ్డానా? కొడుకా? అని అడిగాడు..అయితే, అది రియల్ లైఫ్ లో కాదండోయ్..సినిమా ప్రమోషన్స్ లో..వివరాల్లోకెళితే..రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘జయేశ్ భాయ్ జోర్దార్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్ వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు.

‘జయేశ్ భాయ్ కో లడ్కీ హోగా యా లడ్కీ? ’ అనే క్వశ్చన్ వేస్తూ పోస్టు పెట్టాడు. సదరు పోస్టు చూసి నెటిజన్లు , సినీ అభిమానులు ‘ట్విన్స్ హోగా, జో భీ హోగా జోర్దార్ హోగా, సూపర్బ్ , యూ ఆర్ లుకింగ్ డిఫరెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ ను నయా అవతార్ లో చూడబోతున్న సంగతి పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. వచ్చే నెల 13న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు.

రణ్ వీర్ సింగ్ ఈ చిత్రం తర్వాత ‘సర్కస్, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘సర్కస్’ ఫిల్మ్ లో రణ్ వీర్ సింగ్ కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ చేయనున్నారు రణ్ వీర్ సింగ్. ‘83’ చిత్రంతో చక్కటి పేరు సంపాదించుకున్నారు రణ్ వీర్ సింగ్. కపిల్ దేవ్ బయోపిక్ ను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version