షూటింగ్ లో రవితేజకు గాయం..!

-

మాస్ మహారాజ రవితేజకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఇలాంటి సమయంలో షూటింగ్ లో గాయం బారిన పడ్డాడు హీరో రవితేజ. తాజాగా తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొన రవితేజ కుడిచేతి కి గాయం అయ్యింది. కానీ దానిని లేక చేయకుండా ఆ గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నాడు రవితేజ.

కానీ ఆ కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో చేరిన రవితేజకు వైద్యులు శస్త్రచికిత్స చేసారు. అలాగే మరో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు. అయితే ఈ ఆగస్టులో మిస్టర్ బచ్చన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ.. నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా తన 75 సినిమా చేస్తున్నాడు రవితేజ.

Read more RELATED
Recommended to you

Exit mobile version