నాగార్జున చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ స్టార్ హీరో..ఎవరంటే?

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రజెంట్ ‘ఘోస్ట్’ ఫిల్మ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తన కెరీర్ తొలి నాళ్ల నుంచి కొత్త దనం కోసం ట్రై చేస్తున్నాడు నాగార్జున. ఇక ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నిన్నే పెళ్లాడతా’..ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా..అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసింది.
ఈ పిక్చర్ మేకింగ్ కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డారు కూడా. ఈ సంగతులు పక్కనబెడితే ఈ ఫిల్మ్ కోసం అస్టిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తి ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మాస్ మహారాజ రవితేజ…ఈ పిక్చర్ కు వర్క్ చేశాడు. అయితే, హీరోగా కాదండోయ్..అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా రవితేజ ఈ సినిమాకు పని చేశాడు. ఓ సీన్ లో నాగార్జున జుట్టు పైకి ఎగ‌ర‌డానికి ర‌వితేజ ఫ్యాన్ పట్టుకున్నాడు. అలా ఈ ఫిల్మ్ మేకింగ్ లో రవితేజ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలా ఏడీగా తన కెరీర్ స్టార్ట్ చేసిన రవితేజ..ప్రజెంట్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ పిక్చర్ త్వరలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news