మాస్ మహారాజా కమిట్‌మెంట్..గాయలైనా షూటింగ్‌లో రవితేజ!

-

మాస్ మహారాజా రవితేజ..ప్రజెంట్ వరుస సినిమాల షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించన ‘రామారావు: ఆన్ డ్యూటీ’ పిక్చర్ విడుదల కావాల్సి ఉంది. కానీ, మేకర్స్ వాయిదా వేశారు. ఇకపోతే రవితేజ..ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

కొద్ది రోజుల కిందట ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సందర్భంగా రవితేజ ప్రమాదవశాత్తు జారిపడ్డారని సమాచారం. మోకాలికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వైద్యులు పది కుట్లు వేయడంతో పాటు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. కానీ, ప్రొడ్యూసర్ కు నష్టం రాకూడదనే ఉద్దేశంతో రవితేజ..వెంటనే షూటింగ్ లో పాల్గొన్నారని టాక్.

సినిమా పట్ల తనకున్న కమిట్ మెంట్ అలా ఉంటుందని రవితేజ తన చర్యల ద్వారా నిరూపించాడని ఈ సందర్భంగా మేకర్స్ చెప్తున్నారు. స్టూవర్ట్‌పురం గజదొంగ జీవితాధారంగా 1970ల నేపథ్యంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందుతోంది. ‘దొంగాట’ ఫేమ్ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news