రవితేజ ఏకంగా మహేశ్ బాబు రేంజ్ రెమ్యునరేషన్..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్  మూవీ  విడుదల అయిన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా  కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ ఎంతో మంది యంగ్ డైరెక్టర్ లకు అవకాశం ఇచ్చాడు. వాటిలో కొన్ని ప్లాప్ అవుతున్నా కూడా మరింత మంది యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళుతూనే ఉన్నాడు.

 రీసెంట్ గా తన ధమాకా సినిమా వీకెండ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.. వీకెండ్ లోనే 30 కోట్లు క్రాస్ రాబట్టింది.. దీంతో ఈ సినిమా రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరు భావించారు.అనుకున్న విధంగానే ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.. బ్రేక్ ఈవెన్ దాటి 50 కోట్ల రూపాయలు వసూళ్ల దిశగా దూసుకుపోతుంది.

ఇక రవితేజ గెస్ట్ రోల్ లో నటించిన  సినిమా వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ షాకింగ్ గా మారింది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 17 కోట్ల రూపాయల ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం గెస్ట్ రోల్ కె అంత మొత్తం అంటే అది మహేశ్ బాబు రేంజ్ లోనే తీసుకుంటున్నట్లు ఉంది. ఇక ధమాకా విజయం కూడా వాల్తేరు వీరయ్య కు ప్లస్ కాబోతుంది. దానితో నిర్మాతలు కూడా సై అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news