తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇకపై ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండగా.. గతంలో 11 పేపర్లతో ఉండే పరీక్షలను ప్రభుత్వం కుదించింది. 100శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించనుండగా.. పరీక్షల నిర్వహణలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.