కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలు చేయడానికి కారణం..?

మహానటిగా కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఇక అంతే కాదు తన నటనతో పాత్రను పండించగల ప్రతిభ కేవలం కీర్తి సురేష్ లో మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు. మొన్నా మధ్య వరకూ వరుస ఫ్లాప్ లను చవిచూసిన ఈమె చివరికి చిన్ని సినిమాతో తన లో ఉన్న నటనను మళ్లీ బయటకు తీసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు కీర్తి సురేష్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

ఇకపోతే సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ పెద్దన్నయ్య , భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర పోషించడానికి గల కారణాలను కూడా ఆమె వివరించింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. పెద్దన్నయ్య సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాలో చెల్లి గా నటించడానికి కారణం రజనీకాంత్ సర్.. ఆయన సినిమా లో ఒక్కసారైనా నటించాలనే కోరిక ఉండేది. నిజానికి ఆయన సినిమాలో అవకాశం లభించాలి అంటే చాలా కష్టం. అవకాశం రావడంతో చెల్లెలు పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. ఇక చెల్లెలి పాత్రలు చేస్తే మళ్లీ అవే వస్తాయేమో అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రజనీకాంత్ సర్ తో కలిసి నటిస్తే చాలు అని అనుకున్నాను. అందుకే నటించాను.

ఇక చిరంజీవి గారు నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పాత్రను ఇష్టపడి ఒప్పుకున్నాను. ఇక త్వరలోనే ఆ సినిమా కూడా సెట్స్ పైకి రానుంది అంటూ వెల్లడించింది.