తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా గురువారం కూడా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గుజరాత్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తో మాట్లాడిన సందర్భంగా మోడీ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన కూతురు వైద్యవిద్య అభ్యసించలేకపోయింది అంటూ గుజరాత్ కు చెందిన ఆయుబ్ పటేల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయగా.. మోదీ ఎమోషన్ అయ్యారు.
ఈ విషయంపై తాను దృష్టి సారిస్తానని మీ కుమార్తె వైద్య విద్య అభ్యసించేందుకు ఏమైనా సహాయం చేయగలమెమో పరిశీలిస్తామని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రాగానే.. దాని ఆధారంగానే మోదీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు చేశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా మంజూరు చేయకుండా రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది విద్యార్థుల ఆశయాలను నీరుగార్చారని మోడీపై ఆయన విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై ఈ వివక్ష ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.” మోదీజీ మీరు భారతదేశానికి ప్రధాని.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాని కాదు.” అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మోడీ పై విమర్శలు గుప్పించారు.
Modi Ji, You are the PM of India not just Gujarat
What about the lakhs of young boys & girls of Telangana whom you’ve denied the opportunity to become doctors by NOT sanctioning even one medical college in last 8 years?
Why this discrimination against a performing state? https://t.co/wbNDVraNx0
— KTR (@KTRTRS) May 12, 2022