లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్స్ కు ఆడియెన్స్ రియాక్షన్ ఇది..!

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అదో సంచలనమే.. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మీద ఉంది. ప్రచార చిత్రలతో హోరెత్తిస్తున్న ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో తనలో ఉన్న క్రియేటివిటీ మరింత బయట పెడుతున్నాడు. సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ లేకున్నా రోజుకో పోస్టర్ మాత్రం బయటకు వస్తుంది. లేటెస్ట్ గా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి మరో మూడు పోస్టర్స్ వచ్చాయి.

అందులో ఒకటి ఎన్.టి.ఆర్, చంద్రబాబు ఉన్న పోస్టర్ తో పాటుగా లక్ష్మీ పార్వతి పోస్టర్ కూడా ఉంది. మూడవ పోస్టర్ గా ఎమ్మెల్యేలతో ఎన్.టి.ఆర్ చర్చిస్తున్నదిగా ఉంది. అయితే ఎన్.టి.ఆర్, చంద్రబాబు కలిసి ఉన్న పోస్టర్ పై ఈ ఇద్దరు ఎవరో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేసిన వర్మకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఆ పోస్టర్స్ కామెంట్స్ లో సైకిల్ ఓనర్, టైర్ పంక్చరర్, పొడిచినోడు.. పొడిపించుకున్నోడు, సైకిల్ ఓనర్.. సైకిల్ రోబర్ అంటూ రకరకాల కామెంట్స్ వచ్చాయి. తాను తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కు ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రలో పశ్చిమ గోదావరికి చెందిన ఓ రంగస్థల నటుడు నటిస్తుండగా లక్ష్మి పార్వతి పాత్రలో యజ్ఞా శెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news