రోషన్ కనకాల మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

-

యాంకర్ సుమ-నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ అనే మూవీతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి  బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ వచ్చింది.  ఇప్పుడు తన రెండో సినిమాను లైన్‌లో పెట్టాడు ఈ యంగ్ హీరో. ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను తీసుకొచ్చాడు రోషన్ కనకాల.

‘కలర్ ఫోటో’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ప్రస్తుతం రోషన్ కనకాలతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.   ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. సినిమాకి టైటిల్ మౌగ్లి అని ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఓ గుర్రంతో పాటు రోషన్ కనకాల అడవిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. మొత్తానికి తన సెకండ్ మూవీపై రోషన్ కనకాల ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version