OTTలోనూ RRR రికార్డు..సినీ లవర్స్ ఫిదా

-

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR..ఇండియన్ బాక్సాఫీసు వద్ద రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఇప్పుడు OTTలోనూ సరికొత్త రికార్డులతో అదరగొడుతోంది.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో రామ్ చరణ్ , తారక్ హీరోలుగా నటించారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ విజ్యువల్ వండర్..మే 20 నుంచి OTTలో స్ట్రీమవుతోంది. హిందీ వర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ..నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది.

మే 20 నుంచి ఇప్పటి వరకు 45 మిలియన్ అవర్స్ ఈ పిక్చర్ స్ట్రీమింగ్ అయినట్లు తెలుస్తోంది. అలా నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ఫిల్మ్ గా RRR సరి కొత్త రికార్డు సృష్టించిందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఫిల్మ్ జీ5 ఓటీటీలో స్ట్రీమవుతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ స్టోరి అందించగా, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version