ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్ పక్కన ఎవరు హీరోయిన్‌గా నటిస్తున్నారన్నది దాదాపు ఏడెనిమిది నెలలుగా పెద్ద సస్పెన్స్‌గా మారింది. ముందు బ్రిటన్‌కు చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆమె మధ్యలోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
ఇక ప్రస్తుతం సస్పెన్స్‌కు తెరదించుతూ ఒవీలియా మోరీస్‌ను ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా అఫీషియల్‌గా ప్రకటించారు. ఆమె కొమరం భీం పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్ పక్కన సినిమాలో జెన్నీఫర్‌గా కనిపించనుంది. ఇక ఇప్పటికే 70 శాతం ఆమె పాత్ర లేకుండానే షూటింగ్ కూడా ఫినిష్ చేసేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ పక్కన బ్రిటీష్ అమ్మాయి ఒవీలియా మోర్ హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసిన వెంటనే ఆమె గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
వాస్తవంగా ఆమె బ్రిటీన్‌కు చెందిన యువతి. హీరోయిన్‌గా సినిమాల్లో చేయలేదు. ఈ పాత్రకు కచ్చితంగా విదేశీ అమ్మాయి ఉండాల్సి ఉండడంతో రాజమౌళి వెతికి వెతికి ఒవీలియాను హీరోయిన్‌గా సెట్ చేశాడు. ఆమెకు విదేశాల్లో డ్రామా ఆర్టిస్ట్‌గా మాత్రమే నటించిన అనుభవం ఉంది. ఇక ఇప్పుడు రాజమౌళి దెబ్బతో ఆమె కోసం, ఆమె ఫొటోల కోసం గూగుల్‌లో అటు సినిమా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒవీలియా మోర్ ఓ రేంజ్‌లో పాపులర్ అవుతోంది.