ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ , ఎన్టీఆర్ తమ నటనతో అదరగొట్టేశారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ పాత్ర చిన్నగా ఉందంటూ ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనలపై పరుచూరి స్పందించారు. పాత్ర నిడివి ఎంత సేపు ఉందనేది కాదని, అది ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావాన్ని సృష్టించిందనేది చూడాలని ఆయన అన్నారు.
ఆర్ఆర్ఆర్లో రామ్‌తో పోలిస్తే భీమ్ పాత్ర నిడివి తక్కువ ఉందని దానిపై స్పందించమని అందరూ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. పాత్ర నిడివి ఎంత ఉందనేది కాదు.. ప్రేక్షకులపై ఎంత ప్రభావాన్ని చూపింది అనేది చూడాలి. ‘పెదరాయుడు’లో రజనీకాంత్ రోల్ అతి తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఆ సినిమా ఆడినన్ని రోజులు రజనీకాంత్ రోల్ మనకు గుర్తుకువస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే రామ్ పాత్ర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ రచయిత, దర్శకుడు ఆ రెండు పాత్రలను రెండు కళ్లలా చూశారనిపించింది.
వారిద్దరి పరిచయ సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్‌లను అద్భుతంగా రూపొందించారు. ఆ సన్నివేశాల్లో ఈ హీరోల నటన చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తుంది పాత్రలు రెండింటికి వీరిద్దరూ అద్భుతంగా న్యాయం చేశారు. ఈ సినిమాలో నేను రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను చూడలేదు. కేవలం కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజులనే చూశా. ఇక, సినిమా ఆరంభమైనప్పటి నుంచి రామ్‌చరణ్ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాడనే విషయం తెలియనివ్వకుండా చూపించారు. హావభావాలు పలికించడం, నటనా పరంగా ఆయన ఏ కాస్త తడబడినా మొత్తం సినిమాపై ప్రభావం చూపించేది.. ఆయుధాలు ఎత్తుకెళ్లడానికే తాను బ్రిటిషర్ల దగ్గర పనిచేస్తున్నాడనే విషయాన్ని తెలియనివ్వకుండా అతను అద్భుతంగా నటించాడు” అని పరుచూరి వివరించారు.
ఇక సినిమా ఎంత సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయిందో చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా సహా పాన్ వరల్డ్ లెవెల్లో అదరగొట్టింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ము లేపుతుండగా… ఫైనల్‌గా తెలుగు బుల్లితెరపై టెలికాస్ట్‌కి కూడా సిద్ధం అయింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన స్టార్ మా అతి త్వరలోనే టెలికాస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు రోజు ఆదివారం ఆగస్టు 14న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేసేశారు.
మరి ఈ సినిమా తెలుగు నాట ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూసాం. ఇక టెలికాస్ట్ అయ్యాక మాత్రం డెఫినెట్‌గా తెలుగు బుల్లితెర రికార్డ్స్‌కి ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.