ఓ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే… ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు అందులో చాలానే ఉంటాయి. మంచి సాంగ్స్, మ్యాజిక్, డైలాగ్స్, ఫైట్స్, స్క్రీన్ ప్లే, హీరోహీరోయిన్ పెయిర్.. ఇలా ప్రతిఒక్కటి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ ఆ మూవీ లవ్‌స్టోరీ అయితే మాత్రం హీరో, హీరోయిన్ పెయిర్, వాళ్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడే అది మరింత హైరేంజ్లో సక్సెస్ సాధించి ప్రేక్షకుల మదిని తాకుతుంది. మూవీని మరోస్థాయికి తీసుకెళ్తుంది.
అయితే లవ్స్టోరీయా లేదా ఇతర జానరా అనేది పక్కనపెడితే.. దాదాపుగా ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్‌కు మధ్య ఓ లవ్‌ట్రాక్ ఉంటుంది. కానీ వాళ్లలో కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ మాత్రమే బాగా వర్కౌట్ అవుతుంది. అవే మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా వాళ్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ పండి మనసుల్ని తాకుతాయి. సినిమాను మరోసారి చూడాలనే ఆసక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఆ హీరోహీరోయిన్ తెరపై ఆ రేంజ్లో మ్యాజిక్ చేస్తారు. ఎంతలా అంటే వాళ్లు నిజంగానే రియల్ లైఫ్ కపుల్సా అనిపించేలా చేస్తుంటారు. వాళ్ల కెమిస్ట్రీతో మనం ప్రేమలోకంలో మునిగి తేలేలా చేస్తారు
మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హిట్, ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా.. ఆ జోడీ మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉండిపోతుంది. మళ్లీ ఆ పెయిర్ కలిసి ఎప్పడు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని ఎదురు చూసేలా చేస్తుంది. అలా రీసెంట్గా విడుదలైన సినిమాల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కొన్ని ఆన్‌స్క్రీన్ పెయిర్స్ ఎంతో చూద్దాం…
ఎన్టీఆర్-ఒలివియా.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఈ భారీ చిత్రం.. రాజమౌళి టేకింగ్, హీరోలిద్దరి నటన, గ్రాఫిక్స్‌తో కూడిన ప్రతిసన్నివేశం.. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇక ఎన్టీఆర్ నటనైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈ చిత్రంలో యంగ్ టైగర్ .. హాలీవుడ్ బ్యూటీ ఒలివియాతో మోరిస్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా రిలీజ్ కాకముందే నుంచే టీజర్, పోస్టర్స్‌తో వీరిద్దరి పెయిర్ ఆకట్టుకుంది. నాటునాటు సాంగ్‌తో సహా సినిమా మొత్తంలో ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, సంభాషణలు, సన్నివేశాలు, స్క్రీన్ ఎప్పియరెన్స్ వీక్షకుల్ని హత్తుకుంది.
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అంటే.. సుందరానికీ. దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ కామెడీ రొమాంటిక్ తెరకేకించారు. మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో లేన్నప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా డీలా పడింది. అయితే ఈ సినిమాలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది., వారి మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాకి ప్లస్.
సీతారామం… ప్రేమకథలకు ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీ కీలకం. ఆ విషయంలో దుల్కర్, మృణాల్ మంచి ప్రతిభ చూపించారు. దుల్కర్ కళ్లతోనే భావాల్ని పలికించాడు. మృణాల్ ఠాకూర్ రాణిలా కనిపిస్తూనే చక్కటి భావోద్వేగాల్ని పండించింది. ఆమె నటన సినిమాకు హైలైట్. హను రాఘవుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ విజయవంతంగా ఆడుతోంది.
నక్సలిజం, రాజకీయం, ప్రేమ.. నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా-సాయిపల్లవి జంట ప్రేక్షకుల్ని హత్తుకుంది. ముఖ్యంగా రానా కోసం సాయిపల్లవి చేసే సాహసాలు, నటన, డైలాగ్‌లు ఆకర్షించాయి. కానీ ఈ చిత్రం కథ పరంగా అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది.
డీజే టిల్లు.. థియేటర్లలో ఇటీవల విడుదలై, యువతను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అదిరిపోయే హిట్‌ను అందుకుంది. ఇందులో టిల్లు.. సింగర్ అయిన రాధిక (నేహాశెట్టి)ని తొలిసారి చూడగానే ఇష్టపడతాడు. ఆమెకి తనదైన శైలిలో మాటలు చెబుతూ చెలిమి చేస్తాడు. అలా వీరిద్దరు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మధ్య జరిగే సంభాషణలు, కెమిస్ట్రీ, ముఖ్యంగా సిద్ధు నటన ప్రేక్షకుల్ని బాగా అలరించింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది.
ఇప్పటికే ఆకట్టుకున్న కొన్ని ఆన్‌స్క్రీన్ పెయిర్స్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాయి. మహానటి సినిమాతో అలరించిన విజయ్‌దేవరకొండ-సమంత.. త్వరలోనే ఖుషి సినిమా ద్వారా అభిమానుల్ని అలరించనున్నారు. ఈ సినిమా కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
నేను లోకల్‌తో అలరించిన నాని-కీర్తిసురేశ్ త్వరలోనే దసరాతో పలకరించనున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతోందీ చిత్రం.