సాహో స‌ర్ ప్రైజ్ వ‌చ్చేసింది..

-

‘బ‌హుబ‌లి’ వంటి అంత‌ర్జాతీయ స్థాయి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ త్రిభాషా చిత్రం ‘సాహో’లో న‌టిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ర‌న్ రాజా ర‌న్‌’ ఫేమ్‌ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అత్యంత స్ట‌యిలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్కీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే సినిమాకి సంబంధించి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డే కానుకగా షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్ 1, కథానాయిక శ్రద్ధాకపూర్‌ బర్త్‌డే నేపథ్యంలో విడుదల చేసిన షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్ 2 పేరుతో మేకింగ్ వీడియోలు విడుద‌ల చేశారు. మొద‌టి దాంటో ప్ర‌భాస్ లుక్‌ని, రెండో చాప్ట‌ర్‌లో శ్ర‌ద్ధా లుక్‌ని రివీల్ చేశారు. వీటికి స‌ర్వ‌త్రా విశేష స్పంద‌న ల‌భించింది. సినిమాపై క్రేజ్ ని పెంచాయి. తాజా సినిమాకి సంబంధించి మ‌రో స‌ర్‌ప్రైజ్ ని ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌భాస్ ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం ప్ర‌భాస్ లుక్‌ని విడుద‌ల చేశారు.

Saaho Movie Release On August 15

సీరియ‌స్ లుక్‌లో, స్పోర్ట్స్ గ్లాస్ పెట్టుకుని ఉన్న ప్ర‌భాస్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. సినిమాపై అంచ‌నాల‌ని మ‌రింత‌గా పెంచుతుంది. ఇది ‘డార్లింగ్’ ప్ర‌భాస్ అభిమ‌నులు ఫుల్ ఖుషీ చేస్తుంద‌నడంలో అతిశ‌యోక్తి లేదు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ లుక్‌ని ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాని ఒకేసారి షూట్ చేయ‌డంతోపాటు ఒకే రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సాంకేతికంగా హైలైట్‌గా నిల‌వ‌బోతుంద‌ట‌. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్స్‌ని క్యాప్చర్‌ చేయటం విశేషం. అందుకు త‌గ్గ‌ట్టుగానే బాలీవుడ్‌, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులందరూ కలిసి ఓ విజువల్‌ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారని చిత్ర బృందం చెబుతోంది. బాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ త్రయం శంకర్‌ – ఎహసాన్‌-లాయ్ అద్భుత సంగీతం, సినిమాటోగ్రాఫర్‌ మధి విజువ‌ల్స్, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబుసిరిల్ ఆర్ట్ వ‌ర్క్ కి, ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్ క‌టింగ్ షార్ప్ నెస్ తోడ‌వ్వ‌డంతో సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు.

ప్రభాస్‌ చాలా స్టయిలీష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల నుంచి 200కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా ‘బాహుబ‌లి’ని మించి విజ‌యాన్ని సాధిస్తుందా? లేక నాన్ ‘బాహుబ‌లి’ రికార్డుల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అనేది చూడాలి. దీంతోపాటు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ ప్రేమ క‌థా చిత్రంలో న‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news