అలాంటి పని చేయని ఏకైక హీరోయిన్ సాయి పల్లవెనా..!!

-

టాలీవుడ్ హీరోయిన్ల కాస్త బొద్దుగా కనిపిస్తే ఎక్కువగా జిమ్ములో కష్టపడుతూ ఉంటారు. ఆరోగ్యంతో సహా ఫిట్నెస్ ని కాపాడుకోవడం కోసం జిమ్,యోగ డైట్ వంటివి కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఇది సెలబ్రిటీల లైఫ్ లో నిరంతరం ప్రక్రియగా మారిపోయింది. ముఖ్యంగా శరీరంతో సహా ఇతర వాటిలో మార్పులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీటిని తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. ఇక హీరోయిన్లుగా స్టేటస్ పెరిగే కొద్దీ వారు తమ ఫిట్నెస్ పైన మరింత శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా చిత్రంలోని పాత్ర డిమాండ్ చేస్తే అలా మారిపోయిన సందర్భాలు కూడా చాలా మంది హీరోయిన్లలో చూసామని చెప్పవచ్చు.

అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పవచ్చు. ఉదయాన్నే జిమ్ కి వెళ్ళదు, యోగాకి అటెండ్ అవ్వదు.ఇంకా చెప్పాలి అంటే కనీసం వాకింగ్ వంటివి కూడా చేయదు. కేవలం ఈ ముద్దుగుమ్మ తనకు అంత అందం ఫిట్నెస్ ఎలా వచ్చిందో అనే విషయం కొంతమంది అభిమానులు చర్చించగా వారికి తెలిసిన సమాచారం ప్రకారం. సాయి పల్లవి పూర్తిగా శాకాహారి అందులో కూడా చాలా పరిమితమైన ఆకుకూరలు మాత్రమే తీసుకుంటుందట. అందులో తక్కువ క్వాంటిటీ ఫుడ్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా కొబ్బరినీరు, మజ్జిగ, మంచినీళ్లు మాత్రమే ఎక్కువగా తీసుకుంటుందట. ఇక ఇతర కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి అసలు వెళ్ళదన్నట్లుగా సమాచారం. ఒకవేళ తాగాలి తినాలి అనిపించిన ఆ కోరికలన్నీ చాలా కంట్రోల్ చేసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ . సాయి పల్లవి మొదట్లో బాగా ఇబ్బంది పడిన తర్వాత ఇలా అలవాటైపోయిందట. అందుచేతన సాయి పల్లవి ఇంత అందంగా కనిపించడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news