గత కొన్ని రోజులుగా ఈనాడు మీడియా..ఏ విధంగా వైసీపీని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ విధానాలని తప్పుబడుతూ, ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల దోపిడి అంటూ కథనాలు ఇస్తుంది. అసలు గతంలో ఈనాడు ఈ విధంగా పర్సనల్‌గా టార్గెట్ చేసి కథనాలు ఇచ్చేది కాదు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని హైలైట్ చేసేది. కానీ వైసీపీ నేతలు పదే పదే రామోజీరావుని టార్గెట్ చేయడం, దుష్టచతుష్టయం అంటూ జగన్‌తో సహ వైసీపీ నేతలు విమర్శలు చేయడం, అసలు రామోజీరావుని పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఈనాడు మీడియా..ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడి అంటూ కథనాలు ఇస్తుంది. వరుసపెట్టి విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు, ఎంవివి సత్యనారాయణల భూ అక్రమాలు అని కథనాలు వేసింది. అటు పోలవరం ఇష్యూ, అమరావతి ఇష్యూ..ఇలా జగన్ మాట తప్పిన విధానాలపై కథనాలు వేసింది. మూడేళ్లలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయలేదని, కానీ భూ దోపిడి కోసం రాజధాని అంటున్నారని వైసీపీని టార్గెట్ చేసింది.
అయితే ఈనాడు సంస్థ ఊరికే ఆరోపణలు చేయట్లేదు..ఆధారాలతో సహ ఆరోపణలు చేస్తుంది. ఇలా ఈనాడు రోజుకో కథనం ఇస్తుంది..కానీ ఈనాడుకు వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం లేదు. ఏదో విజయసాయి మొదట్లో మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తె భూములు కొంటే అవి తనవి అవుతాయని చెప్పి..పూర్తిగా కౌంటరు ఇవ్వకుండా రామోజీ కమ్మ, పచ్చ మీడియా అంటూ ఎదురుదాడి చేశారు.
ఇక దీనికి కూడా ఈనాడు తాజాగా కౌంటరు ఇచ్చింది. విజయసాయి అధికారంతో కుమార్తెకు తక్కువ ధరకే భూములు దక్కేలా చేశారని ఆధారాలతో సహ కథనం ఇచ్చింది. ఇలా ఈనాడు..వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తుంది. కానీ ఈనాడుకు వైసీపీ చెక్ పెట్టలేకపోతుంది. ఏదో కులం పేరిట ఎదురుదాడి తప్ప..ఆ అక్రమాలు తాము చేయలేదని ఆధారాలతో సహ కౌంటరు ఇవ్వలేని పరిస్తితి. మరి ఇలాగే పరిస్తితి నడిస్తే..ఈనాడు ఇంకా వైసీపీని రిస్క్‌లో పెడుతుంది. ఈనాడుకు చెక్ పెట్టే విషయంలో జగన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.