యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR మూవీ తరువాత పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చూస్తూ నటిస్తున్న తాజా మూవీ దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. 2024 ఏప్రిల్ 05న దేవర సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. దేవరకి ఎదురు నిలబడే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
ఇవాళ సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కావడంతో దేవర మేకర్స్ నుంచి పోస్టర్ బయటికి వచ్చింది. సైఫ్ కి బర్త్ డే విషెష్ చెబుతూ స్వయంగా ఎన్టీఆర్ ఈ పోస్టర్ లాంఛ్ చేయడం విశేషం. భైరా.. హ్యాపీ బర్త్ డే సైఫ్ సర్ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దేవర సినిమాలోని సైఫ్ అలీఖాన్ లుక్ ని రివీల్ చేశఆడు. లాంగ్ హెయిర్ తో ఇంటెన్స్ కనిపిస్తున్న సైఫ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ డిజైన్ లో పడవలు, సముద్రం, పడవల్లో మనుషులు కూడా ఉన్నారు. దేవరVs భైర మధ్య వార్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.