షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి సమంత తీసుకునే రెమ్యునరేషన్ అంతేనా.. కారణమేంటో మరి..!!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్ ’షోలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. పలు విషయాలపై సమంత చేసిన కామెంట్స్ గురించి నెటిజన్లు చర్చించుకున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..సమంత పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలోనూ ముందుంటుంది.

 

మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు ట్రెండీ ఫ్యాషన్ దుస్తులన ప్రమోట్ చేయడం వైపు మొగ్గు చూపుతుంటుంది. సోషల్ మీడియా వేదికగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటుంది. అలా పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్స్ ద్వారా సమంత బాగానే సంపాదిస్తుంది. అలా సోషల్ మీడియాలో ఉన్న తన పాలోవర్స్ కు తను ప్రమోట్ చేసే బ్రాండ్స్ గురించి చెప్తుంటుంది.

ఈ సమయంలోనే సమంత తన బిజీ టైమ్ లో ఖాళీ దొరికినప్పుడల్లా మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా వెళ్తుంటుంది. కాగా, గతంలో సమంత ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన క్రమంలో తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లినపుడు సమంత చాలా తక్కువ పారితోషికం తీసుకుందట.

స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వెనుక ఏదైనా కారణముందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. రూ.20 లక్షలు మాత్రమే షాప్ ఓపెనింగ్ కు తీసుకుందని వినికిడి. ఇలా అతి తక్కువ పారితోషికం తీసుకుని షాప్ ఓపెనింగ్స్ కు సమంత తీసుకోవడం గురించి చర్చ అయితే జరుగుతున్నది. ఇలా చేయడం ద్వారా అభిమానులను కలుసుకునే అవకాశం ఉంటుందనే సమంత ఇలా చేసి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news