Cauliflower Teaser: మ‌గవారి శీల ర‌క్ష‌ణే త‌న‌ ల‌క్ష్య‌మంటున్న క్యాలీఫ్లవర్

-

Cauliflower Teaser: సంపూర్ణేష్ బాబు సినిమాలంటే చాలా వెరైటీ, వినోద‌భ‌రితమైనా.. భిన్నమైన క‌థాంశంతో తెర‌కెక్కే చిత్రాల్లో న‌టిస్తుంటారు. సంపూ.. హృదయ కాలేయం అనే వెరైటీ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత‌.. కొబ్బరిమట్ట, సింగం 123 లాంటి చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు అదే కోవ‌కు చెందిన క్యాలీ ఫ్లవర్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు.

గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తాజాగా క్యాలీఫ్లవర్ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ మూవీ టీజర్ చూస్తే .. శీలం ఆడాళ్లకే ముఖ్యమా ? మగాళ్ల కూడా శీలం ఉంటుంది. మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసేవాడే క్యాలీఫ్ల‌వ‌ర్ అంటూ న‌వ్వుల పు్వ్వులు పూయిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా సంపూర్ణేష్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఆర్కే మలినేని శాడిజాన్ని చూపించి నాలోని నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా హిట్‌ అయితే దానికి కారణం ప్రేక్షకులు.. తేడా కొట్టిందంటే నా వల్లే’’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news