ఇటీవల కాలంలో పలువురు సినీ దర్శకులు అలనాటి కథానాయికలకు చిత్రాల్లో కీలక పాత్రలు ఇస్తున్నారు. అలా దర్శకులు తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్స్ ను రీ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇప్పటికే అలా పలు సినిమాల ద్వారా కొందరు సీనియర్ హీరోయిన్స్ ను డైరెక్టర్స్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. కాగా, సీనియర్ హీరోయిన్ రాశిని రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర పోషించాలని దర్శకుడు సుకుమార్ అడిగారట. కానీ, ఆమె ఆ పాత్ర పోషించలేనని చెప్పిందట. ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘రంగస్థలం’. ఇందులో నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. చెవిటి వ్యక్తి ‘చిట్టిబాబు’ నటనకు జనాలు ఫిదా అయిపోయారు.
ఇక ఇందులో మరో కీలక పాత్ర బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ ది. ‘రంగమ్మత్త’గా చక్కటి నటన కనబరిచి అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకు ల ఫేవరెట్ యాక్ట్రెస్ అయిపోయింది.
ఈ సినిమా తర్వాత అనసూయ ఇండస్ట్రీ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఇప్పటికీ అనసూయ కు వెండితెరపైన సినిమాల్లో చక్కటి అవకాశాలు వస్తున్నాయి. కాగా ఈ పాత్ర పోషించాలని తొలుత దర్శకుడు సుకుమార్ సీనియర్ హీరోయిన్ రాశిని సంప్రదించారు.
స్టోరి విని పాత్ర గురించి తెలుసుకున్న రాశి పాత్ర ప్రకారంగా తాను మోకాలు, నడుము చీరకట్టు చూపించాల్సి వస్తుందని నో చెప్పేసిందట. అలా ఆ పాత్ర అనసూయ భరద్వాజ్ వద్దకు వచ్చింది. అలా ‘రంగమ్మత్త’ పాత్ర పోషించే క్రమంలో మోకాలి వరకు చీరకట్టు , తొడలు కనిపించేలా ఉండటం ఇష్టం లేదని అనుకుని నో చెప్పేసిందట. అయితే, ఆ పాత్ర అనసూయకు బాగా సెట్ అయిందని తర్వాత రాశి చెప్పింది. ఇక రంగస్థలం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.