ఆది పురుష్ నటీనటుల పారితోషకం తెలిస్తే షాక్..!!

-

ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ డైరెక్టర్ తో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పైన తెరకెక్కించడం జరిగింది.దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఎన్నోసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు రకాల కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ ఉండేది. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు రావడంతో మళ్లీ VFX మళ్లీ రూ.100 కోట్లు కేటాయించి రీ షూట్ చేయడం జరిగింది.

దీంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువగా అయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం. ఇందులో లక్ష్మణుడి పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సన్ని సింగ్ రూ.1.5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ కు జోడిగా సీత పాత్రలో నటించిన కృతి సనన్ ఈ చిత్రం కోసం రూ .3కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఆది పురుష్ చిత్రంలో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నారు .ఈ పాత్రకు గాను దాదాపుగా రూ .14 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.120 కోట్ల రూపాయల వరకు రెమ్యూనికేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించిన మరొకటి సోనాల్ చౌహాన్ కు..రూ.70 లక్షలు అందుకున్నట్టు సమాచారం.ఆది పురుష్ చిత్రం రేపటి రోజున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది మరి ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version