అలాంటి వింత వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..!!

-

యూనివర్సల్ యాక్టర్ కమలహాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతోంది. శృతిహాసన్ మొదట అనగనగా ఒక ధీరుడు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శృతిహాసన్ ఆ వెంటనే స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది.

తెలుగు తమిళ్ భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిందీలో కూడా నటించింది. కానీ అక్కడ సక్సెస్ కాలేక పోయింది శృతిహాసన్. తెలుగులో ఒకానొక సమయంలో వరుస ప్లాప్స్ ఎదురు అవ్వడంతో ఈ ముద్దుగుమ్మను ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రవేశారు. ఆ తర్వాత రవితేజ తో క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. తాజాగా శృతిహాసన్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే శృతిహాసన్ ఒక వింత వ్యాధితో బాధపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.శృతిహాసన్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా ఎన్నో చిత్రాలలో పాటలు పాడింది. శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది.

శృతిహాసన్ ఎక్కువగా ఒత్తిడికి లోనైతే ఊహించని విధంగా మారిపోతుందట. తాను ఎక్కువ ఫీల్ అయితే విపరీతమైన ఆవేశానికి లోనవుతుందట.. అలాంటి సమయంలో చిన్న విషయానికి కూడా విపరీతంగా కోపం తెచ్చుకొని అరిచి గోలగోల చేస్తుందట శృతిహాసన్. అయితే కోపం తగ్గాక ఇలా ఎందుకు చేశానని బాధపడుతుందట. ఈ విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version