హృద్యంగా ‘సీతారామం’ ట్రైలర్..దుల్కర్ సల్మాన్‌కు మృణాళ్ ప్రేమ లేఖ

-

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సీతా రామం’. ఇందులో హీరోగా మాలీవుడ్(మలయాళం)మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. దుల్కర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ నటించింది.

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చాలా హృద్యంగా ఉంది. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ అదరగొట్టేశాడు. కశ్మీర్ కొండల్లో పహారీ కాస్తున్న ఒంటరి సైనికుడిగా అతడిని చూపించారు.

కుటుంబం లేని లెఫ్టినెంట్ రామ్ కు ప్రేమ లేఖ రాసిన మహిళగా మృణాళ్ ఠాకూర్ ను నటించారు. ‘ఇంట్లో తాళీ కట్టిన భార్య నీకు ఉంది ఇట్లు..సీతా మహాలక్ష్మి..’ అని ప్రేమ లేఖను లెఫ్టినెంట్ రామ్ కు మృణాళ్ ఠాకూర్ రాసినట్లు దర్శకుడు టీజర్ లో చూపించారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news