టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీతిసింగ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇక వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయిన ఈమె ఉన్నట్టుండి మన్మధుడు సినిమాలో నాగార్జునతో చేసిన లిప్ కిస్ వల్లే మళ్లీ ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె చివరిగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఇక తెలుగు నుంచి బాలీవుడ్ కి మఖాం మార్చిన రకుల్ ప్రీతిసింగ్ వరుసగా 6 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ కూడా విడుదలకు సిద్ధం కాబోతున్నాయి.
ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీతిసింగ్ ప్రేమించే వ్యక్తిని అందరికీ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రకుల్ ప్రీతిసింగ్ ప్రేమలో ఉంది .ఈ విషయాన్ని ఆమె మీడియాతో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ త్వరలోనే మా అక్క రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకోబోతోంది అంటూ తెలిపినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక దీనిపై స్పందించిన రకుల్ ప్రీతిసింగ్.. అమన్ నువ్వు నిజంగానే ఇలా చెప్పావా? మరి నా పెళ్లి ఎప్పుడో నాకు కూడా చెప్పు ప్లీజ్.. నా లైఫ్ గురించి నాకే తెలియడం లేదు అంటూ రీ ట్వీట్ చేసింది.
దీన్ని బట్టి చూస్తే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పట్లోనే పెళ్లి పీటలు ఎక్కే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. అయితే ఎవరో కావాలని తన తమ్ముడు అమన్ ప్రీత్ ను వాడుకొని రూమర్స్ సృష్టించారని తెలుస్తోంది. మొత్తానికి అయితే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పట్లో వివాహం చేసుకునే పరిస్థితుల్లో లేనట్లు సమాచారం.
😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .. https://t.co/ZSZgNjW2BW
— Rakul Singh (@Rakulpreet) October 12, 2022