వైరల్ అవుతున్న పుష్ప 2 డైలాగ్

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్.

ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం పుష్ప 2 డైలాగ్‌ గురించి ఆసక్తి కరమైన బజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కు వేస్తే పులి వచ్చిందని అర్థం, అదే ఆ పులి నాలుగు అడుగులు వెనక్కు వేసింది అంటే పుష్ప రాజ్‌ వచ్చాడని అర్థం అన్నది డైలాగ్‌. ఈ డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి ఈ డైలాగ్‌ ఈ సినిమాలోనిదేనా అనేది తేలాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news