సాఫ్ట్‌వేర్‌ బ్లూస్ రివ్యూ.. సాఫ్ట్‌వేర్‌ జాబ్స్ ఇలానే ఉంటాయా..కామెడీ పీక్స్..

-

చిత్రం: సాఫ్ట్‌వేర్‌ బ్లూస్..
విడుదల తేదీ: జూన్ 24,2022
నటీనటులు : శ్రీరామ్ నిమ్మల, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేఎస్ రాజు, బస్వరాజ్ తదితరులు.
సంగీతం : సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫీ : నిమ్మ గోపి
నిర్మాణం : సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ సంస్థ
దర్శకత్వం : ఉమాశంకర్

కథ, విశ్లేషణ..
యువత ఎప్పుడూ సినిమాల లో కొత్త దనాన్ని కోరుకుంటారు.. అలాంటి వారి మైండ్ సెట్ ను ఆకర్షించడానికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. అందులో ఒకటి సాఫ్ట్‌వేర్‌ బ్లూస్.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే కథ మొత్తం సాఫ్ట్‌వేర్‌ జాబ్స్ పై తిరుగుతోంది. అసలు యువత మైండ్ సెట్ సాఫ్ట్‌వేర్‌ ఫిల్డ్ లో పడే కష్టాల గురించి సినిమాను తెరకెక్కించారు..ఇప్పటివరకు విడుదల అయిన ట్రైలర్ లు, టీజర్ లు సినిమా పై అంచనాలను పెంచాయి.. ఈరోజు విడుదల అయిన ఈ సినిమాకు టాక్ ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శ్రీరామ్ నిమ్మల, భావనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం..సాఫ్ట్‌వేర్ బ్లూస్.. ఈ సినిమా మొత్తం ఐటి రంగంలో జరిగే వాటి మీద తిరుగుతూంది..శ్రీరామ్ కి ఇది రెండో సినిమా..మొదటి సినిమా ఉత్తర.. ఆ సినిమా తర్వాత భారీ అంచనాల తో ఈ సినిమా రూపొందింది.. ఇప్పటివరకు ఎవరూ చూపించని రీతిలో సినిమా కథ ఉంటుంది. బయట సాఫ్ట్‌వేర్ అంటే పెద్దపెద్ద బిల్డింగ్‌లు లక్షల్లో జీతాలు.. అమ్మాయిలు, పబ్బులు కాదు దూల తీరపోతుంది అని సినిమాలో చూపించారు.

అనేక ట్విస్టులు, ఊహించ‌ని మ‌లుపులు, కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కించిన‌ట్టు చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వారికి ఇచ్చిన టార్గెట్‌లు, ఆ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయడానికి వారు ఎదుర్కొనే ఒత్తిడి లాంటి అనేక విష‌యాల‌ను చూపించ‌డం జ‌రిగింది. ఈ సినిమా చూసిన త‌ర్వాత సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీ ఉద్యోగుల్లో ఉన్న అనేక పార్శ్వాల‌ను జ‌నాలకు తెలియజెప్పటం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. హీరో నటన సినిమాకు ప్లస్ అయ్యింది..కామెడీ టైమింగ్, డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. జాబ్ మీద మాత్రమే కాదు కుటుంబం కూడా ఇంపార్టెంట్ అని చూపించారు..హీరో జాబ్ ని, ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కీలకం..హీరో కు పోటీగా హీరోయిన్ నటించింది..ఈ తరం యువత ఆలోచన ఎలా ఉంటుందో, ఇంటర్నెట్ ను ఎలా వాడుతారు..జాబ్ రాక ముందు వేషం, బాష ఎలా ఉంటుంది..జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ చూపించారు. తను అనుకున్న మార్క్ ను చక్కగా చూపించారు..మెహబూబ్ నటన హైలెట్ అయింది.. ఒకరు అని కాదు..సినిమాలో ప్రతి సీన్ లో పోటీ పడి నటించారు..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.. కొన్ని సీన్లు లాగ్ అయిన ఓవర్ ఆల్ గా సినిమా కొత్తగా ఉందనే టాక్ ను అందుకుంది.. మొత్తానికి హీరోకు మంచి మార్కులు పడ్డాయని సినీ విష్లెషకులు అంటున్నారు.. ఈ సినిమా మంచి టాక్ ని అందుకుంది. హీరోగా రెండో సినిమాకే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. మున్ముందు ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి..

ఆల్ ది బెస్ట్.. సాఫ్ట్‌వేర్‌ బ్లూస్ టీమ్..

రేటింగ్: 3/5

Read more RELATED
Recommended to you

Latest news