సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే..!

-

సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియా మరియు సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్‌ల వివాహం గురించి ఎంతగా చర్చించినప్పటికీ.. అటు సోనాక్షి సిన్హా కానీ.. ఇటు జహీర్ ఇక్బాల్ వైపు నుంచి కానీ ఎలాంటి స్పందించడం లేదు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పెళ్లి జరిగే తేదీని కన్మర్మ్ చేసింది. ఈ విషయాన్ని INDIA TODAY తెలిపింది. ఈనెల 23న ముంబైలోని బాస్టియన్ లో రాత్రి 8 గంటలకు జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోనున్నట్టు పేర్కొంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ వినూతనంగా మ్యాగజైన్ కవర్ పేజి తరహాలో ఉందని వెల్లడించింది. ఇటీవల సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ కి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో కనిపించగా.. దీనిపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించి.. సోనాక్షి పెళ్లి గురించి తనకు ఇంకా చెప్పలేదని పేర్కొనడం గమనార్హం. మొత్తానికి ఈనెల 23న సోనాక్షి పెళ్లి జరుగుతుందన్నమాట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version