ట్రెడిషనల్ వేర్ లో చెమటలు పట్టిస్తున్న స్పై హీరోయిన్..!

-

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అంటే బట్టల సైజు తగ్గించాలనే నినాదాన్ని ఇప్పుడు చాలామంది హీరోయిన్లు పాటిస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నిండుదనాన్ని పాటిస్తూ.. తనదైన వస్త్రాధారణతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికే ట్రెడిషనల్ వేర్ ధరించి తమ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తున్న హీరోయిన్స్ లలో నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో వరుస చిత్రాలతో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గ్లామర్ పరంగా మంచి మార్కులు దక్కించుకుందని చెప్పవచ్చు.

ఇన్ని రోజులు కోలీవుడ్లో సందడి చేసిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది టాలీవుడ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన స్పై చిత్రంలో నటించిన ఈమె ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉందని చెప్పవచ్చు. స్పై చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య మీనన్ వరుసగా ఫోటోషూట్లు రిలీజ్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే బ్యూటిఫుల్ అవుట్ ఫిట్లతో కట్టిపడేస్తున్న ఈమె సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ మరొకసారి అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా చుడీదార్ లో కనిపించిన ఈమె పూల పూల డ్రస్సులో అదిరిపోయే లుక్కును తన సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్యూట్ ఫోజులతో కట్టిపడేసిన ఈమె తన స్మైల్ తో కుర్రాల్లను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా అట్రాక్టివ్ లుక్ లో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా మోహితులవుతున్నారు. టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఈమె మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న స్పై చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత ఎలాంటి ఆఫర్లను అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version