ఉనికి తెలుపే ‘బ్రహ్మాస్త్ర’.. రాజమౌళి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్..!

-

బాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఆయన్ ముఖర్జి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరు జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్ బీర్ కపూర్, ఆయన్ ముఖర్జి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగో రాజమౌళి రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ తోనే ఆసక్తిరేపేలా బ్రహ్మస్త్ర ఉంది. పోస్టర్ ఒక్కటే కాదు డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మన ఉనికి గర్వం.. చరిత్రకు అది శిఖరం. బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతటికి స్థావరం అదే బ్రహ్మాస్త్రం అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

ఇండియాలోనే మొదటి మైథలాజికల్ ఫ్యుజన్ డ్రామా ట్రయాలజీ బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు రాజమౌళి. అద్భుతమైన స్టార్ కాస్ట్, సాంకేతిక నిపుణులతో వస్తున్న ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందించాలని తన విషెస్ అందించారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news